logo


నేను ప్రేమ వివాహమే చేసుకుంటా: అను ఇమాన్యుయెల్

...

'తుప్పరివాలన్' చిత్రంలో విశాల్ కు జోడీగా నటించి తమిళ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు అను ఇమాన్యుయెల్. తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు ప్రస్తుతం తమిళంపై దృష్టి పెట్టారు. ధనుష్ దర్శకత్వం వహిస్తున్న కొత్త చిత్రంలోనూ ఈ అమ్మడే కథానాయికగా ఎంపికయ్యారు. మరో రెండు సినిమాల్లో  నటించడానికి అంగీకరించారు. చిత్ర విశేషాల గురించి అమ్మడు మాట్లాడుతూ 'తమిళ సినిమాల్లోమంచి అవకాశాలు వస్తున్నాయి.  వాటిని  సద్వినియోగం చేసుకుని ప్రేక్షకుల హృదయాల్లో చోటు సంపాదించుకుంటానని' పేర్కొన్నారు. పెళ్లి గురించి అడిగిన ప్రశ్నపై స్పందిస్తూ 'నేను చదవుకునే రోజుల్లోనే నలుగురు అబ్బాయిలు నాకు ప్రపోజ్ చేశారు. ప్రేమ అనేది ఇద్దరి హృదయాలను కలిపి అద్వితీయమైన విషయం. భవిష్యత్తులో నేను తప్పకుండా ప్రేమ వివాహమే చేసుకుంటానని' వివరించారు.