logo


గిన్నీస్ బుక్ లోకి మోడి పుట్టినరోజు..!

...

నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడి పుట్టినరోజును గుజరాత్ లోని ఓ బేకరీ సంస్థ వినూత్నంగా జరిపింది. దానిలో గిన్సిస్ రికార్డ్ లక్ష్యంగా ఆదేరోజు జన్మదినం జరుపుకుంటోన్న 1200 మందిని సూరత్ లోని సర్సానా ఎగ్జిబిషన్ కేంద్రానికి ఆహ్వానించింది. లార్జెస్ట్ సేమ్ బర్తడే గేదరింగ్ పేరుతో రికార్డును సాధించాలనికుంది. ఈ బర్తడే కార్నివాల్ కు ఆ బేకరీ దుకాణం ఆతుల్య శక్తి దివస్ గా పేరు పెట్టింది దేశవ్యాప్తంగా సెప్టెంబరు 17న జన్మించిన వారందరిని ఒకే దగ్గరికి తీసుకొచ్చి ఎవరి కేక్ ను వారితో కట్ చేయించింది. చిన్నారుల నుండి ముసలి వారి వరకు అందరు బర్త్ డే క్యాప్స్ ధరించి, పాటలు పాడి ఆటలు ఆడారు.