logo



బాలికల హాస్టల్ లో ఫుడ్ పాయిజన్ ..!

...

జిల్లాలోని తిరువూరు బీసీ బాలికల హాస్టల్ లో ఫుడ్ పాయిజన్ అయింది. ఈ అన్నం తిన్న 10 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిని వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. కాగా హాస్టల్ నిర్వహకులను పోలీసులు ప్రశ్నించారు. వంటగదిని, స్టోర్ రూంలను పరిశీలించారు. దీనిపై విచారణ జరిపిస్తామని అధికారులు పేర్కొన్నారు. కాగా మరోసారి ఇలాంటి సంఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని హాస్టల్ నిర్వహకులను హెచ్చరించారు.