logo


కర్నూలులో రాహుల్ గాంధీ సంజీవయ్యకు నివాళి, విద్యార్థులతో ముఖాముఖీ ..!

...

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కర్నూలులో పర్యటిస్తున్నారు. ఈరోజు ఉదయం హైదారాబాద్ విమానాశ్రయం చేరుకున్న రాహుల్ గాంధీ అక్కడి నుంచి హెలికాప్టర్ లో కర్నూలుకు చేరుకున్నారు.

కర్నూలులోని పెదపాడులో దివంగత మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం సంజీవయ్య కుటుంబసభ్యులతో మాట్లాడారు. ఈరోజు మధ్యాహ్నం బైరెడ్డి కన్వెన్షన్ సెంటర్ లో విద్యార్థులతో రాహుల్ గాంధీ ముఖాముఖీ నిర్వహిస్తున్నారు. సాయంత్రం ఎస్టీబిసి కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో రాహుల్ ప్రసంగించనున్నారు. పార్టీ నేతలతో తెలుగు రాష్ట్రాల రాజీకీయాలపై కూడా చర్చించే అవకాశం ఉంది. రాహుల్ రాకతో ఏపీలోని కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు భారీ ఎత్తునకర్నూలుకు చేరుకున్నారు. కర్నూలు పర్యటన సందర్భంగా రాహుల్ గాంధీ తన ట్విట్టర్ ఖాతాలో 'నేను కర్నూలులో ఉన్నాను' అంటూ తన షెడ్యూల్ ను పోస్టు చేశారు.