logo


మొదటి సారి మెట్రోల్ చూసినప్పుడే లోపలేదో రింగ్ అయింది పూజాగారు..!

...

నాగార్జున, నాని హీరోలుగా వైజయంతి మూవీస్ సంస్థ నిర్మిస్తున్న చిత్రం 'దేవదాస్'. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పాటలు జనాలకు ఆకట్టుకున్నాయి. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్న 'దేవదాస్' ఈ నెల 27న  ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తుండగా రష్మిక మందన్న, ఆకాంక్ష సింగ్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. కొద్ది సేపటి క్రితం ఈ సినిమా హీరోయిన్ ఆకాంక్ష పరిచయం చేసిన చిత్రబృందం తాజాగా మరో  హీరోయిన్ రష్మిక మందన్నను పరిచయం  చేసింది. ఈ సినిమాలో రష్మిక పేరు పూజ. ఈ పేరుతో ఓ పోస్టర్ ను చిత్రబృందం రిలీజ్  చేసింది. ఈ పోస్టర్ ని ట్విటర్ లో పోస్ట్ చేసిన నాని 'ఫస్ట్  టైం మిమ్మల్ని మెట్రోలో చూసినప్పుడే లోపల ఏదో రింగ్  అయింది పూజాగారు మళ్ళీ ఎప్పుడు' అని ట్వీట్ చేశాడు.