logo



కేటీఆర్ కు శుభాకాంక్షలు తెలిపిన యాంకర్ సుమ..!

...

టీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయనకు శుభాకాంక్షలు తెలిపేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తెలంగాణ భవన్ కు తరలివస్తున్నారు. ఇవాళ ఉదయం ప్రముఖ యాంకర్ సుమ కేటీఆర్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కేటీఆర్ కు ఒక మొక్కను బహుకరించారు. టీఆర్ ఎస్ ప్రభుత్వ పనితీరు బాగుందని సుమ ప్రశంసించారు. ఈ నెల 17 న టీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే.