logo


తీర్ధయాత్రలు చేస్తున్న... నయన & విఘ్నేష్

...

లేడి సూపర్ స్టార్ నయనతార బ్యాక్ టు  బ్యాక్  సినిమాలతో బిజీగా ఉంది. ప్రస్తుతం ఆమె అజిత్ తో 'విశ్వాసం', చిరంజీవితో 'సైరా', కొలైయుదిర్ కాలం' వంటి పలు చిత్రాల్లో నటిస్తుంది. మరోవైపు లేడి సూపర్ స్టార్ చిత్రాల్లోనూ నటిస్తూ బిజీగా ఉంది . ఇదిలా ఉండగా దర్శకుడు విఘ్నేష్ శివన్ తో ఈ అమ్మడు ప్రేమాయణం సాగిస్తున్న విషయం   తెలిసిందే. అప్పుడప్పుడు ఇద్దరూ తీసుకున్న ఫోటోలను  సామాజిక మాధ్యమాల్లో  పోస్ట్ చేస్తుంటారు. మొన్న మధ్య అమెరికాలో ఈ ఇద్దరూ సందడి చేశారు. తాజాగా అమృత్సర్లోని గోల్డెన్ టెంపుల్కి వెళ్లి కొంత సమయాన్ని గడిపారు నయన్ అండ్ విఘ్నేష్. నయనతార ఎప్పుడు అమృత్సర్ వెళ్లినా ఒంటరిగా వెళ్లేవారు. కానీ ఇప్పుడు జంటగా వెళ్లడం కోలీవుడ్ లో హాట్ టాపిక్. అంటే వీరి పెళ్లికి శుభఘడియలు దగ్గర పడుతున్నాయా అనే చర్చ మళ్లీ ఊపందుకుంది. ఇద్దారు అక్కడ ఉన్న ఫోటోలు వైరల్ గా మారాయి.