logo


పతంజలి పాల ఉత్పత్తులు ..!

...

ఆయుర్వేద ఉత్పత్తులు, నిత్యావసర వస్తుల వ్యాపారంలో అగ్రగామి సంస్థగా నిలుస్తున్న రాందేవ్ బాబాకు చెందిన పతంజలి ప్రొడక్ట్స్ తోరదరలోనే పాలు,పాల ఉత్పత్తులు వ్యాపారంలోకి అడుగు పెడుతోంది. వచ్చే ఏడాదిలో 1000కోట్ల వ్యాపారమే లక్ష్యంగా ఈ రంగంలోకి అడుగు పెడుతున్నామని బాబా రాందేవ్ చెప్పారు. ఈ ఏడాది రూ.500కోట్ల వ్యాపారం జరుగుతుందని ఆశిస్తున్నుట్లు ఆయన పేర్కొన్నారు. ప్రతి రోజు 10లక్షల లీటర్ల అమ్మకాలను లక్ష్యంగా పెట్టుకున్నామని రాందేవ్ అన్నారు. ఇతర సంస్థల కంటే రూ.2 తక్కువకే తమ పతంజలీ పాలు దొరుకుతాయని కంపెనీ పేర్కొంది. మరోవైపు కూరగాయలు, స్వీట్ కార్న్ర్,  బీన్స్ తదితర ఉత్పత్తులను కూడా  విక్రయించే యోచనలో ఉన్నట్టు సంస్థ ప్రతినిధులు  తెలిపారు. ఇప్పటికే దేశీయ ఉత్పత్తులను మార్కెట్ లోకి తీసుకొచ్చి ప్రముఖ రిటైల్ స్టోర్ లకు పోటీనిస్తున్న బాబా రామ్దేవ్ తన పతంజలీ నుంచి మరో ఐదు ఉత్పత్తులను మార్కెట్ లోకి తెనున్నట్లు తెలిపారు. సమర్థ భారత్, స్వస్థ భారత్ మిషన్ లోభాగంగా పాలు, పాల ఉత్పత్తులు, నిల్వ చేయడానికి విలున్న కూరగాయలు, సోలార్ ఉత్పత్తులు, డ్రింకింగ్ వాటర్, పశువుల మేతకు సంబంధించిన    ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకురానున్నట్లు రాందేవ్ తన ట్విట్టర్ లో ప్రకటించారు.  ఈ         నేపథ్యంలో దాదాపు 20 వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నట్లు సంస్థ తెలిపింది.