logo



డేంజర్ జోన్ లో... ఇండియా

...

ఇండియాలో కరోనా కేసులు భారీగా కొనసాగుతోంది...రోజురోజుకు కరోనా కేసులు సంఖ్య పెరుగుతుంది . రోజుకో కొత్త రికార్డు స్థాయి కొత్త కరోన కేసులు నమోదు అవుతున్నాయి...సడలింపులతో నాలుగో దశ లాక్‌డౌన్‌ కొనసాగుతున్న మహమ్మారి నియంత్రణలోకి రావడం లేదు...కరోనా యాక్టివ్ కేసుల విషయంలో ప్రపంచంలోనే ముందున్న ఐదు దేశాలలో భారతదేశం చేరింది... ఇక, గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో కొత్తగా 5,609 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయినట్టు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ విడుదల చేసిన కోరాని హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.. దీంతో.. దేశవ్యాప్తంగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 1,12,359కు చేరింది.. ఇందులో ప్రస్తుతం 63,624కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.. 48,735 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రిల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. మరోవైపు గత 24 గంటల్లో భారత్‌లో 132 మంది కరోనా బారినపడి మృతి చెందారు.. దీంతో.. మృతుల సంఖ్య 3,435కు చేరింది.