logo



భారత్ లో ...ఒకే రోజు రికార్డ్ స్థాయిలో కరోనా కేసులు

...

కరోనా కట్టడికి లాక్‌డౌన్ విధించి ఎన్ని కఠినమైన చర్యలు తీసుకున్నా ఆ మాయదారి వైరస్‌ మాత్రం వ్యాప్తిచెందకుండా ఆగడంలేదు.. రోజురోజుకో కొత్త రికార్డు తరహాలో అత్యధిక కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి.. లాక్‌డౌన్‌ 3.0 ముగిసి.. లాక్‌డౌన్‌ 4.0కి చేరుకున్నా.. కరోనా విలయతాండం చేస్తూనే ఉంది.. తాజాగా కేంద్రం కుటుంబ, ఆరోగ్యశాఖ విడుదల చేసిన కరోనా హెల్త్ బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో భారత్‌లో కొత్తగా 5,242 కొత్త కేసులు నమోదు అయ్యాయి.. ఒకేరోజు ఇంత భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదు కావడం ఇదేతొలిసారి. దీంతో.. దేశవ్యాప్తంగా నమోదైన కరోనా కేసుల సంఖ్య 96,169కు చేరింది.. మరోవైపు గత 24 గంటల్లో 157 మంది మృతిచెందడంతో.. ఇప్పటివరకు మృతిచెందినవారి సంఖ్య 3,029కు పెరిగింది. కరోనా బారినపడి కోలుకుని 36,824 మంది డిశ్చార్జ్ కాగా.. ప్రస్తుతం 56,316 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.