logo


వరుసగా 3 మూవీ లు ప్లాప్ అయిన మళ్ళి కొత్త మూవీ తో రాబోతున్న హీరో ..!

...

నితిన్ కెరీర్ పడిలేచిన కెరటమే ,వరుసగా పది ప్లాపులు అందుకున్న హీరో మళ్ళీ లేచాడు. ఇష్క్ సినిమాతో మళ్ళీ ఫాం లోకి వచ్చాడు. అయితే ఇప్పుడు మళ్ళీ ట్రాక్ తప్పాడు. అ ఆ'తో కెరీర్ బిగ్గెస్ట్  హిట్ కొట్టిన నితిన్ కి ఆ తర్వాత ఏది కలిసి రావడం లేదు. 'లై' డిజాస్టర్ అయింది. తర్వాత వచ్చిన 'ఛల్ మోహన్ రంగ' పెద్ద ఫ్లాప్ అయింది. దిల్ రాజు బ్యానర్, 'శతమానం భవతి'  డైరెక్టర్ వున్నా శ్రీనివాస కళ్యాణం అట్టర్ ఫ్లాప్ అయింది. వరుసగా మూడు భారీ పరాజయాలతో నితిన్ కెరీర్ ఇబ్బందుల్లో పడింది. ఈ క్రమంలో ఆయన 'ఛలో' దర్శకుడు వెంకి కుడుములతో 'భీష్మ' అనే చిత్రానికి నితిన్ రెడీ అవుతున్నాడు. సితార ఎంటర్  టైన్ మెంట్స్ నిర్మించే ఈ చిత్రంలో కథానాయకిగా రష్మిక మందాన నటిస్తుందని సమాచారం. 'గీత గోవిందం' తో యూత్ కి మరింత దగ్గరయిన రష్మిక ఇప్పుడు ఫుల్ డిమాండ్ లో వుంది. ఛలో తో హిట్టు కొట్టిన   వెంకీ కుడుముల మంచి జోరులోవున్నాడు. మరి ఈ హిట్ కాంబినేషనైనా నితిన్ కు మళ్ళీ ట్రాక్  ఎక్కిస్తుందో  లేదో చూడాలి.