logo


మరో డిఫరెంట్ లుక్ తో సూర్య ..!

...

కేవీ ఆనంద్ దర్శకత్వంలో సూర్య ఓ సినిమా చేస్తున్నాడు. సాయేషా సైగల్ కథానాయికగా నటిస్తోన్నఈ సినిమా, ప్రస్తుతం పొల్లాచ్చిలో షూటింగ్ జరుపుకుంటోంది. మోహన్ లాల్, ఆర్య ముఖ్యమైన పాత్రలను పోషిస్తుండగా, ప్రస్తుతం రెండో షెడ్యూల్ జరుపుకుంటుంది. ఈ చిత్రనికి సంబంధించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇందులో సూర్య డిఫరెంట్ లుక్ తో కనిపిస్తున్నాడు. సరికొత్త కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మిస్తుండగా,  ఈ సినిమాను వచ్చే ఏడాది ఏప్రిల్ 14వ  తేదీన విడుదల చేయనున్నారు. అయితే సూర్య,సెల్వరాఘవన్ దర్శకత్వంలో ఎన్జికే అనే చిత్రాన్ని చేస్తున్నాడు. ఈ సినిమాలో రకుల్ప్రీతీసింగ్, సాయిపల్లవి హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాలో రాజు భాయ్ పాత్రలో        సూర్య కనిపించనున్నట్టు సమాచారం. యువన్ శంకర్ రాజా చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా రిసెంట్  గా షూటింగ్ పూర్తిచేసి, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. డిసెంబర్ లో సినిమా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.