logo


మదర్ థెరిస్సా అవార్డు ను అందుకున్న లారెన్స్

...

నటుడు, కొరియోగ్రాఫర్, దర్శకుడు ఐన లారెన్స్ కేవలం సినిమాలతోనే కాక సామాజిక సేవలతోనూ ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు. ది లారెన్స్ ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా పలు సేవా కార్యక్రమాలు చేస్తుంటారు లారెన్స్. ఇప్పటివరకు 150కి పైగా చిన్నారులకి ఓపెన్ హార్ట్ సర్జరీలు చేయించారు. తాజాగా కేరళ వరదల వలన నిరాశ్రయులైన వారికి కోటి రూపాయల విరాళంగా ఇచ్చారు. ఐతే తనలో సేవా గుణాన్ని గుర్తించిన మదర్ థెరిస్సా ఛారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులు చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో లారెన్స్ కు మదర్ థెరిస్సా అవార్డు ఇచ్చి సత్కరించారు. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ద్వారా తెలియజేస్తూ తన సేవలని గుర్తించిన వారికి ధన్యవాదాలు తెలియజేశారు.