logo



తమిళనాడు లో కుండపోత వర్షాలు

...

తమిళనాడును భారీ వర్షాలు వణికిస్తున్నాయి. ఆరు జిల్లాల్లో ఇప్పటికే రెడ్ అలెర్ట్ ప్రకటించారు. కొయంబత్తూర్‌లో కురుస్తున్న భారీ వర్షాలకు నాలుగు ఇళ్లు కూలి 15మంది మృత్యువాత పడ్డారు. నధూర్ ప్రాంతంలో ఉన్నట్టుండి నాలుగు ఇళ్లు కూలి అందులో నివాసం ఉంటున్న 15 మంది చనిపోయారు. కాగా భారీ వర్షాల నేపథ్యంలో పాఠశాలలకు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. చెన్నై నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచింది. నగర శివారులో వంద ఇళ్లు నీట మునిగాయి. నాగపట్నం, తుత్తకూడి, కడలూరి జిల్లాల్లో వందకు పైగా ఇళ్లు నీట మునిగాయి. వరదల నేపథ్యంలో సహాయక చర్యలు చేపట్టేందుకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. తిరువల్లూర్, వెల్లూర్, తిరువన్నమలై, తూత్తుకూడి, రామనాథపురం, తిరునెల్వేలి జిల్లాల్లో వచ్చే 24 గంటల్లో 20 సెంటీమీటర్లకు పైగా వర్షం కురుస్తుందని వాతావరణశాఖ అధికారులు చెప్పారు.