logo


నాకైతే పిల్లలు కావాలనే...కానీ చైతూ నిర్ణయమే కీలకం: సమంత

...

నాగచైతన్య వివాహం చేసుకుని అక్కినేని ఇంటి కోడలు అయిన తర్వాత కూడా హీరోయిన్ గా తన జోరు కొనసాగిస్తోంది సమంత. ఈ ఏడాది సమంత నటించిన 'రంగస్థలం', మహానటి, అభిమన్యుడు సినిమాలు ఘనవిజయాలు సాధించాయి. తాజాగా ఆమె నటించిన యూటర్న్', సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా పిల్లల గురించి సమంత మాట్లాడింది. పిల్లల గురించి ఇంకా ప్లాన్ చేసుకోలేదు. నాకైతే పిల్లలు కావాలనే ఉంది. అయితే ఈ విషయంలో చైతూ నిర్ణయమే కీలకం. చైతూ ఎప్పుడంటే  అప్పుడు పిల్లల గురించి ప్లాన్ చేస్తాం. పిల్లల విషయంలో చైతూను ఇబ్బంది పెట్టను. ఈ వినాయక చవితికి విడుదల కాబోతున్న మా ఇద్దరి సినిమాలు  ఘనవిజయాలుగా నిలవాలన్ని  కోరుకుంటున్నానని సమంత చెప్పింది.