logo


ధరించిన నల్ల చున్నీలు తీసుకున్న పోలీసులు ..!

...

ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పాల్గొననున్న ఒక సభకు హాజరైన కొందరు విద్యార్ధినులు తమ యూనిఫారంలో భాగంగా ధరించిన నల్ల చున్నిలను  పోలీసులు తీసేసుకున్నారు. రాష్ట్రంలో రాజకీయ నేతల పట్ల ప్రజలు నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలియజేస్తున్న నేపథ్యంలో పోలీసులు విద్యార్థినులు ధరించిన నల్ల చూన్నీలను తీసుకున్నారు. తాము సభాప్రాంగణానికి వచ్చినప్పుడు ఒక మహిళ పోలీసు అధికారి   తమను నల్ల చూన్నీలను తీసి బ్యాగుల్లో పెట్టుకోవాలని చెప్పారని, తరువాత పోలీసులు వాటిని తీసేసుకున్నారని ఒక విద్యార్థి చెప్పింది.