logo


సామ్ మూవీ కన్నా నా మూవీ చూడండి అంటున్న చైతు

...

రియల్ లైఫ్ కపుల్ అక్కినేని నాగచైతన్య, సమంత అతి త్వరలో వెండితారపై పోటీ పడబోతున్నారు. మారుతి దర్శకత్వంలో నాగచైతన్య నటించి 'శైలజా రెడ్డి అల్లుడు' సినిమా వినాయక చవితి సందర్భంగా విడుదల కాబోతుంది. ఈ సినిమా విడుదల సమయంలో సమంత ప్రధాన పాత్రలో నటించిన 'యూటర్న్' కూడా విడుదల సిద్ధమవుతోంది. దీంతో ఈ ఇద్దరి మధ్య పోటీ తప్పడం లేదు. తన భార్య నటించిన 'యూటర్న్' కాకుండా తన సినిమానే  మొదట చూడాలని చైతూ అంటున్నాడు. దానికి చైతూ చెప్పిన  కారణం వెరైటీగా ఉంది. ప్రేక్షకులందరూ నా సినిమానే చూడాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ సంవత్సరంలో  నాకు ఇదే మొదటి సినిమా. కానీ, సమంత  ఇప్పటికే 'రంగస్థలం', మహానటి'వంటి బ్లాక్బస్టర్ విజయాలను అందుకుంది. కాబట్టి సమంత సినిమా కాకుండా నా సినిమానే ముందు చూడండి. 'శైలజారెడ్డి అల్లుడు' సినిమాను సమంత చూసింది. తనకు సినిమా బాగా నచ్చింది. అందరికి కచ్చితంగా నచ్చుతుందని చైతూ చెప్పాడు.