logo


కొండగట్టు వద్ద బస్సు బోల్తా 30 మంది మృతి..!

...

 

 

జగిత్యాల జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కొండగట్టు ఘాట్ రోడ్డులో ఆర్టీసీ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 30 మంది మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలిస్తున్నారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనాస్థలి వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.