logo


దాసరి నారాయణ ఇంటి గుట్టు బయటపడింది ..!

...

దర్శకరత్న, దివంగత దాసరి నారాయణ ఇంట్లో వివాదం రాజుకుంది. తనను ఇంట్లోకి రానివ్వడం లేదంటూ ఆయన పెద్దకోడలు సుశీల పోలీసులను ఆశ్రయించారు. దాసరి నారాయణరావు పెద్దకుమారుడు ప్రభుతో 1995లో ప్రేమ వివాహం జరిగిందని, ఆ తర్వాత రిజిస్ట్రేషన్  మ్యారేజ్ కూడా చేసుకున్నామని వెల్లడించింది. ఆమెకు పలు మహిళ సంఘాలు బాసటగా నిలిచాయి. దాసరి నారాయణరావు ఉన్నంతకాలం తమ కుటుంబానికి అండగా నిలిచారని, ఆయన మరణానంతరం కొడుకు తమను విస్మరించడంతో పాటు కనీసం ఇంటి అద్దె కూడా ఇవ్వకపోవడంతో రోడ్డున పడ్డామని అని చెప్పారు. మామ గౌరవం కోసమే తాను ఇంత కాలం బయటకి రాలేదని, సినీ పెద్దలు మోహన్ బాబు, రాజేంద్రప్రసాద్ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని, ఇటీవల మోహన్ బాబుకు ఫోన్ చేసి సమస్య గురించి మరిసారి గుర్తు చేయగా తనకు ఆ విషయంతో ఎలాంటి సంబంధంలేదని చెప్పినట్లు ఆమె చెప్పుకొచ్చారు.