logo



లోక్ సభలో రాఫెల్ రాజ్యసభలో కావేరి..!

...

రఫెల్ డీల్ అంశంపై ఇవాళ లోక్ సభలో విపక్షాలు ఆందోళన చేపట్టాయి. రాఫెల్ చర్చించాలని పట్టుపట్టాయి. సభ ప్రారంభం కాగానే విపక్షాలు నినాదాలతో హోరెత్తించారు. స్పీకర్ సుమిత్రా మహాజన్ సభ్యులను వేడుకున్నా ఎవరూ వినిపించుకోలేదు. ప్రశ్నోత్తరాలను విపక్ష సభ్యులు అడ్డుకున్నారు. రాఫెల్ పై జేపీసీ వేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. దీంతో లోక్ సభను ఇవాళ ఉదయం 12 గంటల వరకు స్పీకర్ వాయిదా వేశారు. మరో వైపు రాజ్యసభను రేపటికి వాయిదా వేశారు. క్రిస్మస్ సెలవులతో ఇవాళ ప్రారంభమైన రెండు సభల్లోనూ ఆందోళనలు మిన్నంటాయి. కావేరి నదిపై కర్నాటక నిర్మిస్తున్న డ్యామ్ ను నిలిపేయాలని తమిళనాడు ఎంపీలు రాజ్యసభలో డిమాండ్ చేశారు. గందరగోళం నెలకొనడంతో సభను రేపటికి వాయిదా చేశారు.