logo



త్ప్లి మహిళా డీజీపీ కన్ను మూత

...

హైదారాబాద్; భారతదేశతోలి మహిళా మాజీ డీజీపీ కాంచన్ చౌదరి భట్టాచార్య కన్ను మూశారు . గత కొంతకాలంగా అనారోగ్యం తో బాధపడుతున్న చౌదరి భట్టాచార్య ముంబయి లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి తుదిశ్వాస విడిచింది భట్టాచార్య మృతి పట్ల దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖులు ఐ పీ ఎస్ అధికారులు నివాళులర్పించారు. భట్టాచార్య సేవలను ఉత్తరాఖండ్ పోలీసులు గుర్తు చేసుకున్నారు. 1973 బ్యాచ్ కు చెందిన భట్టాచార్య.. ఉత్తరాఖండ్ తొలి మహిళా డీ జీ పీ గా 2004 లో నియామకం అయ్యారు 2007 అక్టోబర్ 31 న పదవీ విరమణ పొందారు ఆ తర్వాత 2014 లోక్ సభ ఎన్నికల్లో అమ్మ్ ఆద్మీ పార్టీ తరుపున హరిద్వార్ లోక్ సభ నియోజకవర్గం నికి పోటీ చేశారు తొలి మహిళా ఐ పీ ఎస్ ఆఫీసర్ కిరణ్ బేడి కాగా, కాంచన్ చౌదరి భట్టాచార్య ఐ పీ ఎస్ సాధించిన రెండో మహిళగా ఘనత సాధించారు. భట్టాచార్య హిమాచల్ ప్రదేశ్ లో జన్మించారు. అమృత్ సర్ ప్రభుత్వ మహిళా కళాశాల నుంచి డిగ్రీ పట్టా పొందారు డిల్లీ యూనివర్సిటీ పరిధిలోని ఇంద్రప్రస్ద కాలేజీ నుంచి ఇంగ్లీష్ లిటరేచర్ అభ్యసించారు. 1993 లో ఆస్ట్రేలియాలో బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ లో  మాస్టర్స్ చేశారు