logo


భారత్ ఆటగాడి పట్ల క్రీడాస్ఫూర్తి చాటిన ఇంగ్లాండ్ ఆటగాడు

...

ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ పేరు చెబితే ఆటతోపాటు వివాదాలు గుర్తొస్తాయి. బ్రిస్టర్ బార్ ముందు మనోడు పడిన గొడవ కళ్ల ముందు మొదులుతుంది. అప్పటినుంచి స్టోక్స్ అంటేనే కాస్త జాగ్రత్తగా చూస్తున్నారట. కానీ భారత్ తో జరుగుతోన్న ఐదో టెస్టు సందర్భంగా స్టోక్స్ క్రీడా స్ఫూర్తి చాటాడు. తనలో ఓ మంచి మనిషి ఉన్నాడని నిరూపించాడు. ఓవల్ టెస్టులో భారత్ ఇన్నింగ్ సమయంలో రాహుల్ బ్యాటింగ్ చేస్తుండగా ఈ ఘటన జరిగింది. స్టోక్స్ బౌలింగ్ లో డిఫెన్స్ ఆడిన రాహుల్ పరుగు కోసం ప్రయత్నించాడు. పరుగెత్తే క్రమంలో అతడి పాదానికి ఉన్న షూ ఊడిపోయింది. దీంతో రాహుల్ ఒక కాలికి షూ లేకుండానే రన్నింగ్ చేశాడు. బౌలింగ్ చేసి తిరిగి బౌలర్ ఎండ్ కు వెళ్తున్న స్టోక్స్ షూ కింద పడిపోవడం చూసి వెనక్కి వెళ్లాడు. షూ తీసుకొని లెస్ సరిచేసి రాహుల్ చేతికి అందించాడు. ఇంగ్లాండ్ ఆల్ రౌండర్ చేసిన పనికి రాహుల్ మాత్రమే కాకుండా క్రికెట్ అభిమానులు కూడా ఫిదా అయ్యారు.