logo



మంత్రిని కలిసిన పలమనేరు నూతన డిఎస్పీ యుగంధర్ బాబు..!

...

పలమనేరు నూతన డిఎస్పీ యుగంధర్ బాబు ఈరోజు ఉదయం పలమనేరులోని మంత్రి కార్యాలయంలో మంత్రి అమరనాథ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రికి పుష్పగుచ్ఛన్ని అందించారు. ఇటీవల పోలీసు శాఖ చేపట్టిన బదిలీల్లో భాగంగా కర్నూలు ఎస్ డిపివో (సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్) గా పని చేస్తున్న యుగంధర్ బాబు పలమనేరు డిఎస్పీగా బదలీ అయ్యారు. ఈరోజు నుండి పలమనేరు డిఎస్పీగా విధులు చేపట్టడంతో ముందుగా మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో పలమనేరు సిఐ ఈద్రు భాషా, ఎస్ ఐ చంద్రమోహన్ లు ఉన్నారు.