logo

దమ్మున్న జోడీ ...ఆర్టికల్ 370 రద్దు..

...

జమ్మూకశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి హోదా కల్పిస్తున్న ఆర్టికల్ 370ను రద్దు చేస్తూ ఇవాళ కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రాజ్యసభలో ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఆ వెంటనే దీనికి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఆమోదం తెలిపారు. ఆర్టికల్ 370ను రద్దు చేస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఉత్తర్వులు జారీ చేశారు. అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతాలుగా జమ్మూ-కశ్మీర్ ఏర్పడ్డాయి. అసెంబ్లీ లేని కేంద్రపాలిత ప్రాంతంగా లడఖ్ ఏర్పడింది. దీనికి సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ ఆగస్టు 7న ప్రకటన చేయనున్నారు. ఆర్టికల్ 370 తొలగిస్తున్నామని, 35-A రద్దు చేస్తున్నామని రాజ్యసభలో సవరణ ప్రవేపెట్టారు అమిత్ షా. ప్రతిపక్షాల ఆందోళనల నడుమ ఆయన ఏకకాలంలో 4 బిల్లులు ప్రవేశపెట్టారు. దీంతో ఒక్కసారిగా సభలో గందరగోళం నెలకొంది. అమిత్ షా ప్రకటనను వ్యతిరేకిస్తూ విపక్ష సభ్యులు నినాదాలు చేశారు. ఆర్టికల్ 370 రద్దు సందర్భంగా PDP MPలు నిరసన వ్యక్తం చేశారు. రాజ్యసభలోనే చొక్కాలు చించుకుని నిరసన తెలిపారు. కాంగ్రెస్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు.