logo



ట్రాక్టర్ ను ఢీకొట్టిన గూడ్స్ రైలు..!

...

కొత్తగూడెం పట్టణంలోని బూడిదగడ్డ సమీపంలో ట్రాక్టర్ ను గూడ్స్ రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ నూజ్జు నూజ్జు అయింది. బూడిదగడ్డ సమీపంలో రైల్వేట్రాక్ పక్కన డ్రైన్ కాల్వ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఆ పనులకు ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్ పట్టాల మధ్య ఇరుక్కుపోవడంతో ఆర్సీహెచ్ పి నుంచి రైల్వేస్టేషన్ వైపు వెళ్తున్న బొగ్గు రవాణా గూడ్స్ ట్రాక్టర్ ను ఢీకొట్టింది. రైలు వస్తున్న విషయాన్ని గమనించిన ట్రాక్టర్ డ్రైవర్ ముందే కిందకు దిగడంతో పెనుప్రమాదం తప్పింది.