logo



చంద్రబాబు తో రాయపాటి సాంబశివరావు భేటీ

...

చంద్రబాబుకు అవసరమైతే గుంటూరులో తన నివాసం వాడుకోవచ్చు.అమరావతి  చంద్రబాబు నివాసానికి అవసరమైతే గుంటూరులోని తన నివాసం ఇచ్చేందుకు సిద్ధమని రాయపాటి సాంబశివరావు ప్రకటించారు.మాజీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడుతో రాయపాటి సాంబశివరావు శుక్రవారంనాడు భేటీ అయ్యారు. తెలుగుదేశం పార్టీ ,రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్తుతులపై చంద్రబాబుతో చర్చించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు నాయుడుకు సైతం ఈ విషయాన్ని చెప్పానని రాయపాటి తెలిపారు. ప్రజావేదిక కూలగొట్టడం,చంద్రబాబు నివాసానికి నోటీసులివ్వడం కక్ష్యపూరిత దొరణిగానే ప్రజలు భావిస్తున్నారని రాయపాటి పేర్కొన్నారు.ప్రజావేదికను కులగొట్టకొండా ప్రభుత్వ అవసరాలకు వాడుకోవాల్సిందని రాయపాటి పేర్కొన్నారు.ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి సారించాలని,కక్ష్యా పూరిత ధోరణితో వ్యవహరించరాదని ఆయన హితవుపలికారు.