logo

నేడు హిమాచల్ పర్యటించనున్న ప్రధానమోడి ..!

...

ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఈరోజు హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాలలో పర్యటించనున్నారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేరుకున్న లక్ష్యాలు, చేపడుతున్న వివిధ కార్యక్రమాలపై రూపొందించిన డాక్యుమెంటరీని ప్రధాని విడుదల చేయనున్నారు. వివిధ ప్రభుత్వ పథకాలతో లబ్దిపొందుతున్నవారితో మోడి ముఖాముఖీ కార్యక్రమంలో పాల్గొంటారు.