logo



జనవరి నుంచి షూటింగ్ ..!

...

ఎనర్జీటిక్ స్టార్ రామ్ పోతినేని, సంచలన దర్శకుడు పూరీ జగన్నాధ్ కలయికలో సినిమా అఫిషియల్ గా కన్ఫర్మ్ అయ్యింది. పక్క యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈ సినిమా రాబోతుంది. హీరోలను స్టైలిష్ గా చూపిస్తూనే డైనమిక్ రోల్స్ తో వాళ్ల ఇమేజ్ ను మార్చేస్తుంటారు పూరీ జగన్నాధ్. ఇపుడు రామ్ తో కూడా ఇదే చేయబోతున్నారు. ఆయన ఈ సినిమా కోసం పూర్తిగా కొత్తలుక్ లోకి మారిపోయారు రామ్. పూరీ జగన్నాధ్ సొంత నిర్మాణ సంస్థ పూరీ టూరింగ్ టాకీస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. జనవరిలో రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టి మేలో సినిమాను విడుదల చేయటానికి ప్లాన్ చేస్తున్నారు. సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు.