logo


చెక్ బౌన్స్ కేసులో కోర్టు కు హాజరైన ...బండ్ల గణేష్

...

చెక్ బౌన్స్  కేసులకు సంబంధించి సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ నిన్న ప్రొద్దుటూరు కోర్టుకు హాజయ్యారు. కోర్టు వర్గాల  వివరాల మేరకు నిర్మాత బండ్ల గణేష్ ప్రొద్దుటూరుకు  చెందిన 68 మందికి వడ్డీకి డబ్బు ఇచ్చారని తెలుస్తోంది. ఆ లావాదేవీలకు సంబంధించి ఆయన చెక్లు  ఇస్తే  అవి బౌన్స్ కావడంతో బాధితులు కోర్టును ఆశ్రయించారు. వీటిలో మూడు కేసులకు సంబంధించి కోర్టు వారెంట్ ఇచ్చింది. దీంతో బండ్ల గణేష్ కోర్టుకు రీకాల్ చేసుకుని నిన్న ప్రొద్దుటూరు ఫస్ట్ ఏడిఎం కోర్టులో న్యాయమూర్తి ఎదుట  హాజరయ్యాడు. ఇదిలా ఉండగా మూడు కేసులకు సంబంధించి లోక్ అదాలత్ తో రాజీ అయినట్లు కోర్టు వర్గాల తెలిపాయి. చెక్ బౌన్స్ కేసుల విచారణ అనంతరం ఫస్ట్ ఏడిఎం ప్రదీప్ కుమార్ విచారణ ను అక్టోబరు 9కి వాయిదా వేసినట్లు కోర్టు వర్గాలు  తెలియజేశాయి.