logo



శ్రీవారిని దర్శించుకున్న రోహిత్‌ శర్మ దంపతులు

...

క్రికెటర్ రోహిత్ శర్మ దంపతులు తిరుమల శ్రీవారిని ఈరోజు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఆలయ అధికారులు రోహిత్ శర్మకు స్వాగతం పలికి ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. ఐపీఎల్ లో ముంబయి ఇండియన్స్ ఫైనల్ కి చేరడంతో స్వామివారి ఆశీస్సుల కోసం తిరుమలకు వచ్చినట్టు రోహిత్ శర్మ తెలిపారు. ఈ సందర్భంగా రోహిత్ శర్మను చూసేందుకు అభిమానులు పోటీ పడ్డారు. మరో క్రికెటర్ దినేష్ కార్తిక్ అర్చన సేవలో పాల్గొని శ్రీవారిని దర్శించుకున్నారు.