logo



పసుపు రక్తం ఉంటేనే సమస్యలు పరిష్కరిస్తారా..?

...

తన ప్రయత్నం వల్లే తాడేపల్లి గూడెంలో నిట్ వచ్చిందని ఎమ్మెల్యే మాణిక్యలరావు తెలిపారు. ఈరోజు మీడియాతో మాట్లాడుతూ అభివృద్ధిని చంద్రబాబు తన సొంత జిల్లాకే పరిమితం చేశారని విమర్శించాడు. శ్రీకాకులం జిల్లాకు ఏం చేశారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. గోదావరి డెల్టా ఆధునికరణను పట్టించుకోలేదని ఆరోపించారు. ధర్మపోరాటం దీక్షలకు ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారన్నారు. జన్మభూమి కమిటీలు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పసుపు రక్తం ఉంటేనే సమస్యలు పరిష్కరిస్తారా అని ఎమ్మెల్యే మాణిక్యలరావు ప్రశ్నించారు.