logo


న్యూలుక్ తో తేజ్ అదరగొడతాడట ..!

...

సాయి ధరమ్ తేజ్ ఈ మధ్యకాలంలో మంచి హిట్ అనేది లేక చాలా ఇబ్బంది పడుతున్నాడు. కరుణాకరన్ దర్శకత్వంలో తెరకెక్కిన లవ్ అండ్ రోమాంటిక్ ఎంటర్ టైనర్ తేజ్ ఐ లవ్ యూ మూవీ అయినా తనకు సక్సెస్ తెచ్చిపెడుతుందేమోనని ఆశ పడ్డాడు కానీ ఆ సినిమా కూడా తేజుకి నిరాశనే మిగిల్చింది. ఇప్పటికైనా మంచి హిట్ కొట్టకపోతే కెరీర్ చాలా కష్టమవుతుందని భావించిన తేజు ఆచి తూచి అడుగులేస్తున్నాడు. తేజ్ ఐ లవ్ యూ మూవీ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న ఈ యాంగ్ హీరో ఇటీవల ఓ సినిమాకు కమిట్ అయ్యాడు. ఈ సినిమాలో న్యూ మేకోవర్ కోసం రెండు నెలల క్రితమే అమెరికా వెళ్ళాడు. నెక్ట్స్వీక్ ఈ యాంగ్ హీరో తిరిగి హైదరాబాద్ రాబోతున్నాడు అది కూడా న్యూలుక్ తో. మరో ఆసక్తికర విషయం ఎంటంటే  ఈ సినిమా కోసం తేజు బరువు  కూడా  తగ్గడట.టోటల్ గా చెప్పాలంటే బరువు తగ్గి న్యూలుక్ లో ఈ యంగ్ హీరో అదరగొట్టేస్తాడట.  ప్రస్తుతానికి ఈ సినిమాకు సంబంధించిన మిగతా  వివరాలేమీ తెలియరాలేదు. తేజు యూ ఎస్ నుంచి తిరిగిరాగానే అన్నీ విషయాలు వెల్లడించే అవకాశం ఉందని తెలుస్తోంది.