logo



తీరప్రాంత ప్రజలకు ఆర్టీజీఎస్‌ హెచ్చరికలు

...

తీరప్రాంత ప్రజలకు ఆర్టీజీఎస్‌ హెచ్చరికలు జారీ చేసింది. ఉత్తరాంధ్రలో సముద్రం కల్లోలంగా ఉంది. 4 నుంచి 6 మీటర్ల ఎత్తు వరకు అలలు ఎగసిపడుతున్నాయి. భీమిలి, విశాఖ బీచ్‌ల వద్ద అలలు ఎగసిపడుతున్నాయని.. ప్రజలు తీర ప్రాంతాలకు వెళ్లకూడదని.. సెల్ఫీలు తీసుకోరాదని ఆర్టీజీఎస్ వెల్లడించింది. ఈ నేపథ్యంలో పోలీసులు, జిల్లాల యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. సర్వైలెన్స్ కెమెరాలతో తీరప్రాంతాల్లో పర్యవేక్షణ చేస్తున్నట్టు ఆర్టీజీఎస్‌ పేర్కొంది.