logo



125 సీట్లతో టీడీపీ గెలవబోతుంది: గంటా

...

125 సీట్లతో టీడీపీ గెలవబోతుందని మంత్రి గంటా శ్రీనివాసరావు ధీమా వ్యక్తం చేశారు. మళ్లీ పనిచేసే ప్రభుత్వానికే ప్రజలు పట్టంకట్టబోతున్నారని వ్యాఖ్యానించారు. పోలింగ్ రోజు ఓటర్ల స్పందన ప్రజాస్వామ్యంపై వారి బాధ్యతకు నిదర్శనమన్నారు. ఏర్పాట్లలో లోపాలపై స్వయంగా ఎన్నికల కమిషనర్ ఒప్పుకున్నారని తెలిపారు. భద్రత ఇవ్వలేకపోయామని.. ఓట్లు గల్లంతు నిజమేనని ద్వివేది ఒప్పుకున్నారని వెల్లడించారు. 20 నుంచి 30 శాతం వరకూ ఈవీఎంలు ప్రారంభంలో పని చేయలేదని గుర్తుచేశారు. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో 37 వార్డు 209 బూత్‌లో అర్ధరాత్రి 2 గంటల వరకూ పోలింగ్ జరిగిందన్నారు. అధికారులను మార్చి రాష్ట్రంలో భయాన్ని సృష్టించారని ఆరోపించారు. ఓటర్లు ఇబ్బంది పడకూడదనే టీడీపీ పోరాటం చేస్తుందని స్పష్టంచేశారు.