logo



ఈసీపై మండిపడ్డ కోడెల

...

ఈసీపై స్పీకర్ కోడెల శివప్రసాదరావు మండిపడ్డారు. ఎన్నికల నిర్వహణలో విఫలమైనందుకు ఈసీ సిగ్గుపడాలని, కేంద్ర బలగాలు ఇవ్వకుండా వైసీపీకి అనుకూలంగా వ్యవహరించారని ధ్వజమెత్తారు. ఓ చోట పోలింగ్‌ బూత్‌లో హోంగార్డు మాత్రమే ఉన్నాడని దుయ్యబట్టారు. ఇనిమెట్లలో వైసీపీ నేతలు రెచ్చగొట్టి దౌర్జన్యం చేశారని, ఇంతవరకు తన ఎదురుగా వచ్చి చెయ్యెత్తిన పరిస్ధితి లేదని, ఎన్ని చేసినా టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. బాసులింగారెడ్డి, అంబటి, రాజనారాయణలపై కేసులు పెట్టాలని కోడెల శివప్రసాదరావు డిమాండ్ చేశారు.