logoపాలకొల్లులో మెగా ఫ్యామిలీ రోడ్‌ షో ... పవన్‌తో పాటు బన్నీ

...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి నేడు చివరి రోజు కావడంతో అన్ని పార్టీల నేతలు ప్రచారంలో మునిగితేలుతున్నారు. ఇటు ఏపీ సీఎం చంద్రబాబు, అటు వైకాపా అధినేత జగన్ విస్తృతంగా ప్రచారం చేస్తుండగా, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌తో పాటు ఆ పార్టీ తరపున మెగా హీరోలు కూడా ప్రచార కార్యక్రమాలలో పాల్గొంటున్నారు.తాజాగా పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో జనసేన పార్టీ ఎన్నికల ప్రచార రోడ్డు షోలో పవన్‌తో పాటు మరో మెగా హీరో అల్లు అర్జున్ కూడా పాల్గొన్నారు. కుటుంబంలో తామంతా వెన్నంటే నిలుస్తామని పవన్‌కి అల్లు కుటుంబం వారు సంఘీభావాన్ని ప్రకటించారు.