logo


భారీ బడ్జెట్ తో మహేష్ నెక్ట్స్ సినిమా..!

...

సూపర్ స్టార్ మహేష్ బాబు మహర్షి సినిమ షూటింగ్ లో బిజిబిజిగా ఉన్నాడు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో మహేష్ సరసన  పూజా హెగ్డే హీరోయిన్ నటిస్తోంది. ఈ సినిమాను ఏప్రిల్ లో విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. ఒకపక్క ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుండగానే మరో సినిమా కోసం సన్నాహాలు ప్రారంభమయ్యాయి. సుకుమార్ దర్శకత్వంలో 26వ సినిమాకు మహేష్ కమిట్ అయిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం ఈ సినిమా బడ్జెట్ ఎంత అనే విషయం వెలుగులోకి వచ్చింది. ఈ సినిమా కోసం మైత్రి మూవీ మేకర్స్ రూ.150 కోట్ల బడ్జెట్ ను కేటాయించిందని తెలుస్తోంది. ఈ సినిమా కోసం హాలీవుడ్ టెక్నీషియన్స్ పనిచేయనున్నారని సమాచారం. దీంతో ఈ సినిమాకు భారీ బడ్జెట్ ను మైత్రి మూవీ మేకర్స్ కేటాయించిందని తెలుస్తోంది.