logoడ్రగ్స్ సరఫరా చేస్తున్న ముఠా అరెస్ట్ ..!

...

నిషేధిత డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముగ్గురు సభ్యులు ముఠాను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. కెన్యాకు చెందిన రేయ్మాండ్, నేరేడ్ మెట్ కు చెందిన సుమంత్, ఆర్మూర్ కు చెందిన హుస్సేన్ ను అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. నైజిరియాకు చెందిన సామ్ పరారీలో ఉన్నాడు. ముఠా సభ్యుల నుంచి 10 గ్రాముల కొకైన్, 127 ప్యాకెట్ల గంజాయి, 4 కిలోల ముడి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో కాలేజీ విద్యార్ధులకు డ్రగ్స్ ను సరఫరా చేసేందుకు యత్నించినట్లు పోలీసులు నిర్ధారించారు.