logo


టివీ చానళ్ళుకు వరస ఇంటర్వ్యూలు ఇస్తున్న సమంతా..."యూటర్న్".

...

వరుస విజయాలతో మంచి ఫామ్ లో ఉన్న అక్కినేని సమంత నటిస్తున్న తాజా చిత్రం 'యూటర్న్'. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్ 13న రెండు భాషల్లో ఒకేసారి విడుదల కాబోతుంది. విడుదల సమయం దగ్గర పడడంతో వరుస ఇంటర్వ్యూల తో అమ్మడు ఫుల్ బిజీగా ఉంది. ఇటీవల తమిళ సంగీత దర్శకుడు అనిరుధ్ తో ప్రమోషనల్ వీడియోలో కనబడి చిత్రం పై అంచనాలను పెంచేసిన ఈ బ్యూటీ తాజాగా వరుస టీవి చానళ్ల కు ఇంటర్వ్యూలు  ఇస్తూ సినిమా విశేషాలను తెలుపుతూ సినిమా పై మరింత అంచనాల పెంచేస్తుంది. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో భూమిక, ఆది పినిశెట్టి ముఖ్యపాత్రల్లో నటించారు. సమంత తో పాటు  బరిలో భర్త నాగ చైతన్య నటించిన శైలజారెడ్డి అల్లుడు చిత్రం కూడా బాక్సిఫీస్ వద్ద పోటీ పడనుంది. మరి ఈ బరిలో ఎవరు గెలుస్తారనేది చూడాలి.