logo

నా పగ తీర్చుకుంటా: వర్మ

...

శివ’ సినిమా చిత్రీకరణ సమయంలో తన తండ్రి కృష్ణం రాజుతో క్లాప్‌కొట్టించారు వర్మ. అప్పటి ఫొటోను కూడా వర్మ ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేస్తూ.. ‘నేను దర్శకుడిని అవుతానంటే మా నాన్న నన్ను నమ్మలేదు. అందుకే ‘శివ’ సినిమాకి మా నాన్న చేతే క్లాప్‌ కొట్టించి పగ తీర్చుకున్నాను’ అని పేర్కొన్నారు. నాగ్‌తో తీయబోయే సినిమా నవంబర్‌ 20 నుంచి అన్నపూర్ణ స్టూడియోస్‌లో మొదలుకాబోతోంది. ఈ సినిమాకి ఇంకా టైటిట్‌ ఖరారు చేయలేదు. ఈ చిత్రంలో నాగార్జునకి జోడీగా టబు నటించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. మరోపక్క వర్మ అలనాటి నటుడు నందమూరి తారక రామారావు జీవితాధారంగా ‘లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.