logo
బెంగళూరు ఎంబస్సి టెక్ విలేజ్ కు బాంబు బెదిరింపు ..టేక్కిలు పరుగోపరుగుబెంగళూరు లో  ఔటర్ రింగ్ రోడ్డులో ఉన్న ప్రసిద్ది చెందిన ఎంబస్సి  టెక్ విలేజ్ లో బాంబు పెట్టాము , ఐదు నిమిషాలలో బాంబు పేలుతుందని శుక్రవారం మద్యానం గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి బెదిరించాడు . అందులో పనిచేసి  సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు ,ఉద్యోగులు రోడ్డు మిద కు పరుగు తీసారు . ఇక్కడ చాల జాతీయ,అంతర్జాతీయ కంపెనీలు  ఉన్నాయి . దాదాపు 7 వేల మందికి పైగా సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు విలేజ్ కంపెనీ లో ఉద్యగాలు చేస్తున్నారు . విషయం తెలుసు కున్న బాంబు నిర్విర్యాదళం బృందం ,పోలీసులు ,అగ్నిమాపక సిబ్బంది ,పోలీసులు  సంఘటన స్థలానికి చేరుకొని  పరిశీలిస్తున్నారు . బాంబు బెదిరింపు కాల్ రావడం  నిజమే అని వైట్ ఫీల్డ్ విభాగం డిసిపీ  అబ్దుల్ అహమ్మద్ మీడియాకు చెప్పారు .