అమరావతిలో గత 6 నెలలుగా నిలిచిపోయిన అభివృద్ధి పనుల పరిశీలనకు తెదేపా ప్రజాప్రతినిధులతో కలిసి, చంద్రబాబు బస్సులో బయలుదేరారు. ఈ సందర్భంగా పత్రికల వారితో మాట్లాడుతూ ఆంధ్రుల ఆత్మగౌరవ ప్రతీక అయిన అమరావతి పై జరుగుతున్న కుట్రలను బట్టబయలు చేసేందుకే తన పర్యటన అని వివరించారు.