కశ్మీర్ విషయంలో ఆ రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తికి వీలు కల్పిస్తున్న 370 ఆర్టికల్ ని కేంద్రం రద్దు చేసిన నేపథ్యంలో ఇక ఇప్పటివరకు ఈ రాష్ట్ర జనాభాలో ప్రత్యేక వర్గంగా ఉంటూ వచ్చిన కాశ్మీరీ పండిట్ల గురించి కూడా చెప్పుకోవలసిందే.. ఒకప్పుడు కాశ్మీరీ బ్రాహ్మణులుగా కూడా వీరిని వ్యవహరించేవారు. తొలుత ముస్లిముల ప్రాబల్యానికి ముందు వీరు ఈ రాష్ట్రంలో ' హిందూ కమ్యూనిటీగా ' నివసిస్తూ వచ్చారు. అయితే క్రమంగా ముస్లిముల ప్రభావం పెరగడంతో అనేకమంది ఈ మతంలోకి మారుతూ వచ్చారు. కొద్దిమందిని ఆయా ప్రభుత్వాలు కాశ్మీరీ హిందూ వర్గీయులుగా పరిగణించాయి. అలాగే అక్కడి సమాజం కూడా. 1557 లో నాడు కాశ్మీర్ ను ఆక్రమించిన అక్బర్ చక్రవర్తి..