logo

హీరో కోసం వచ్చి ఫోన్లు పోగొట్టుకున్నారుముంబయి: బాలీవుడ్‌ కింగ్‌ ఖాన్‌ షారుక్‌ ఖాన్‌ అభిమానులకు చేదు అనుభవం ఎదురైంది. గురువారం షారుక్‌ తన 52వ పుట్టినరోజు జరుపుకొన్నారు. ఈ సందర్భంగా వేలాది మంది అభిమానులుషారుక్‌ నివాసం (మన్నత్‌) వద్దకు చేరుకొన్నారు. షారుక్‌ని చూడాలని అతని ఫొటోలు తీయాలన్న ఆలోచనలో పడి 11 మంది అభిమానులు తమ ఫోన్లు పోగొట్టుకున్నారు. గురువారం రాత్రి బాంద్రా పోలీసులకు దాదాపు 13 ఫిర్యాదులు అందాయట. షారుక్‌ నివాసం వద్దే తమ ఫోన్లు పోయినట్లు ఫిర్యాదులు వచ్చాయని పోలీసులు తెలిపారు. వారిలో 26 ఏళ్ల అంకిత్‌ సాహు అనే యువకుడు కూడా ఉన్నాడు. పాపం అతను కేవలం షారుక్‌ కోసం ఏకంగా చత్తీస్‌గఢ్‌ నుంచి ముంబయి వచ్చాడట. షారుక్‌ని చూసేందుకు వేలాది మంది అభిమానులు మన్నత్‌ చుట్టూ గుమిగూడటంతో పోలీసులు వారిపై లాఠీఛార్జ్‌ చేశారు. వారిలో కొందరు తీవ్రగాయాలపాలయ్యారు. షారుక్‌ తన కుటుంబం, స్నేహితులతో కలిసి ముంబయిలోని అలీబౌగ్‌లో ఉన్న తన ఫాం హౌస్‌లో పుట్టినరోజు వేడుకలు జరుపుకొన్నారు. ఈ వేడుకకు బాలీవుడ్‌ ప్రముఖులు హాజరయ్యారు.